‘శివ ఈజ్ బ్యాక్.. వర్క్ డన్’ అంటూ వింతగా పద్మజ కేకలు

ABN , First Publish Date - 2021-01-26T18:39:05+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన..

‘శివ ఈజ్ బ్యాక్.. వర్క్ డన్’ అంటూ వింతగా పద్మజ కేకలు

చిత్తూరు/మదనపల్లె : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో ఎట్టకేలకు ఆ యువతుల తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిని మదనపల్లె తాలూకా పోలీసు స్టేషనుకు తరలించారు. అనంతరం పురుషోత్తం, పద్మజలను వైద్య, కోవిడ్ పరీక్షల నిమిత్తం మదనపల్లి జిల్లా వైద్యశాలకు పోలీసులు తరలిస్తున్నారు.


శివ ఈజ్ బ్యాక్..!

అయితే.. పోలీసుల ముందే పద్మజ వింత వింతగా ప్రవర్తిస్తూ.. కేకలు పెట్టారు. ‘శివ ఈజ్ బ్యాక్.. వర్క్ ఈజ్ డన్.. ఐయామ్ శివ’ అంటూ కేకలు పెడుతున్నారు. అరవకూడదని పోలీసులు చెప్పినప్పటికీ ఆమె మరింతగా అరుస్తూ ఆస్పత్రికి వెళ్లారు. అంతేకాదు.. తనను కరోనా‌ ఏమి చేయలేదని కూడా పద్మజ గట్టిగా కేకలు వేయడం గమనార్హం. వైద్య పరీక్షల అనంతరం ఈ ఇద్దర్నీ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. కోర్టులో వీరిరివురూ ఏం చెబుతారు..? వీళ్ల మాటలకు జడ్జి ఎలా రియాక్ట్ అవుతారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-01-26T18:39:05+05:30 IST