ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-10-30T04:59:43+05:30 IST

పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
మృతుడు సద్గురు (ఫైల్‌ఫొటో)

యువకుడు మృతి..  యువతి సురక్షితం

కలకడ, అక్టోబరు 29: పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో యువకుడు మృతిచెందగా యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కలకడ మండలంలో జరిగింది.పోలీసుల కథనం మేరకు.. బాలయ్యగారిపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన డేరంగుల వెంకటేష్‌ కుమారుడు సద్గురు(21) ట్రాక్టర్‌ డ్రైవర్‌. ఇతడు, అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన ఇంటర్‌ చదువుతున్న ఓ యువతి(17) కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్దల వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అయితే అమ్మాయి మైనర్‌ కావడంతో అందుకు వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు  చనిపోవాలని నిర్ణయించుకున్నారు. వేర్వేరుగా గురువారం రాత్రి ఎవరి ఇళ్ల వద్ద వారు విషం తాగారు. అబ్బాయి విషం తాగి కేవీపల్లె మండలం గుండ్రేవారిపల్లె క్రాస్‌ సమీపంలోని ఎర్రగుండప్పగారి పల్లెలోనిఅక్కగారింటికి వెళ్లాడు. అక్కడ అతడి పరిస్థితి గుర్తించిన అక్క, ఇతర కుటుంబ సభ్యులు వెంటనే పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో  రాత్రి ఒంటి గంట సమయంలో మృతిచెందాడు. యువతి మహల్‌ క్రాస్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో ప్రాణపాయం నుంచి బయట పడింది. మృతుడి అన్న గురుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-30T04:59:43+05:30 IST