భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-26T05:23:10+05:30 IST

అధికారుల కళ్లుగప్పి ఓ ఇంట్లో నిల్వవుంచిన కర్ణాటక మద్యాన్ని పలమనేరు ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం రాత్రిసీజ్‌ చేశారు.

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
ఎక్సైజ్‌పోలీసులు స్వాధీనం చేసుకున్న కర్ణాటక మద్యం

గంగవరం,ఆగస్టు25 :అధికారుల కళ్లుగప్పి ఓ ఇంట్లో నిల్వవుంచిన కర్ణాటక మద్యాన్ని పలమనేరు ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం రాత్రిసీజ్‌ చేశారు. గంగవరం మండలం మన్నార్‌నాయినిపల్లెలో కర్ణాటక మద్యం నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పలమనేరు ఎక్సైజ్‌ సీఐ ఎల్లయ్య సిబ్బందితో కలసి ఆ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంటికి తాళం వేసివుండగా, అనుమానం వచ్చి తొంగిచూడగా మద్యం బాక్సులు ఉన్నట్లు గుర్తించారు. పెద్దమనుషుల సహకారంతో ఎక్సైజ్‌ అధికారులు తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి తనిఖీలు చేయగా , నిల్వ ఉంచిన భారీ మద్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. కర్ణాటకకు చెందిన 90ఎంఎల్‌ 3648, 180ఎంఎల్‌ 336తో కలపి మొత్తం 3984 టెట్రాప్యాకెట్లు బయటపడ్డాయి.  మద్యాన్ని సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మద్యం నిల్వవుంచిన యుగంధర్‌ పరారీలో ఉన్నాడని,  త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్‌ సిబ్బంది వెంకటరత్నం, దేవరాజ్‌, వెంకటేష్‌, సయ్యద్‌బాష పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-26T05:23:10+05:30 IST