సరిహద్దుల్లో భారీగా మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-05-24T07:11:01+05:30 IST

సత్యవేడు మండల సరిహద్దు నుంచి తమిళనాడు వెళుతున్న వాహనాల్లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి.

సరిహద్దుల్లో భారీగా మద్యం పట్టివేత
సత్యవేడులో పట్టుబడిన నిందితులు, మద్యం బాటిళ్లు

సత్యవేడు, మే 23: సత్యవేడు మండల సరిహద్దుల నుంచి తమిళనాడు వైపు వెళుతున్న వాహన తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. తమిళనాడులో లాక్‌డౌన్‌ సందర్భంగా మద్యం షాపులు మూసివేయడంతో తమిళ మందుబాబులు ఏపీలోని షాపులకు ఎగబడుతున్నారు.  ఆదివారం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని వారి నుంచి మద్యం బాటిళ్ళతో పాటు. రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో చెన్నైరోడ్డులోని రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ నాగార్జునరెడ్డి ఆదివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడు  వైపుకు వెళుతున్న ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీ చేయగా 320 ఆంధ్ర మద్యం బాటిళ్ళను గుర్తించి, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు చెన్నైకు చెందిన ఆల్బర్ట్‌, ఐన్‌స్టీన్‌, జోసఫ్‌ అనే వ్యక్తులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ రూ.52400 అని ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎ్‌సఐ దయానిధినాయుడు, హెడ్‌ కానిస్టేబుల్‌ రెడ్డి శేఖర్‌, సిబ్బంది గంగాదరం, శేఖర్‌,  దేవేంద్రనాయక్‌, రాము తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వరదయ్యపాళెం మండలంలోనూ అక్రమ మద్యం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి బత్తలవల్లం వద్ద నిర్వహించిన దాడుల్లో తమిళనాడుకు మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు 103 క్వార్టర్‌ బాటిళ్ళు, 12 బీర్‌ బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆరంబాకంకు చెందిన టీసీ కుమార్‌, చెన్నైకు చెందిన జీవా అనే వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ గోపి, సిబ్బంది అశోక్‌, కృష్ణమరాజు, గోవిందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-24T07:11:01+05:30 IST