కరోనాతో లైన్‌మన్‌ గంగాధరం మృతి

ABN , First Publish Date - 2021-05-18T05:36:50+05:30 IST

సోమల ట్రాన్స్‌కో సబ్‌ స్టేషన్‌ లైన్‌మెన్‌ గంగాధరం (55) సోమ వారం ఉదయం మృతిచెందారు.

కరోనాతో లైన్‌మన్‌ గంగాధరం మృతి
లైన్‌మన్‌ గంగాధరం

సోమల, మే 17: సోమల ట్రాన్స్‌కో సబ్‌ స్టేషన్‌  లైన్‌మెన్‌ గంగాధరం (55) సోమ వారం ఉదయం మృతిచెందారు.  అడుసు పల్లెకు చెందినకు చెందిన గంగాధరం తిరుపతి స్విమ్స్‌లో కరోనాకు చికిత్స పొందుతూ అక్కడే మృతిచెందారు. ఆయన మృతదేహానికి పుంగ నూరుకు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ మైనార్టీ యువత అంత్యక్రియలు జరిపారు. లైన్‌మన్‌ మృతి పట్ల సోమల ట్రాన్స్‌కో ఏఈ రాంప్రసాధ్‌రెడ్డి, సబ్‌ ఇంజనీర్‌ మహేంద్రరెడ్డి, సోమల లైన్‌ఇన్స్ప్‌క్టర్‌ వి.వెంకటరమణ, లైన్‌మెన్లలు చిన్నప్పరెడ్డి, రాజేశ్వరనాయుడు, మురళీ, సుబ్రహ్మణ్యం, నవీన్‌ రాయల్‌, మంజునాధ్‌ తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులను  వైసీపీ నాయకులు పరామర్మించారు. అలాగే వల్లిగట్ల పంచా యతీ తుంగలొడ్డుకు చెందిన చలంకోటి రెడ్డెప్ప (37) కరోనా పాజిటివ్‌తో ఆందోళన చెంది ఇంటి వద్దనే మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన రమణ (42) హైదరాబాద్‌లో ప్రైవేటు కాంట్రాక్ట్‌ పనులు చేసేవాడు. పాజిటివ్‌తో రెండు రోజుల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు. ఆదివారం మృత్యువాత పడ్డారు. కాగా సర్పంచ్‌ సౌజన్య అక్కడికి చేరుకుని కూలీలతో హైపోక్లోరైట్‌ పిచికారీ చేయించారు. 

Updated Date - 2021-05-18T05:36:50+05:30 IST