49 మండలాల్లో తేలికపాటి వర్షం

ABN , First Publish Date - 2021-11-02T06:31:25+05:30 IST

49 మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది.

49 మండలాల్లో తేలికపాటి వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 1: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 49 మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. రేణిగుంటలో అత్యధికంగా 45.2 మి.మీ, గుర్రంకొండలో అత్యల్పంగా ఒక మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. వరదయ్యపాళ్యంలో 41.4, కేవీబీపురంలో 40.4, వడమాలపేటలో 32.4, కార్వేటినగరంలో 31, పిచ్చాటూరులో 30.2, నారాయణవనంలో 23.6, నాగలాపురంలో 22.6, ఏర్పేడులో 22, తిరుపతి అర్బన్‌లో 21.8, విజయపురంలో 18.8, నిండ్రలో 17.4, బీఎన్‌ కండ్రిగ, పుత్తూరులో 17.2, చంద్రగిరిలో 16.4, పీలేరులో 15.4, ఆర్‌సీపురంలో 11.4, తొట్టంబేడు, సత్యవేడులో 10.2, కుప్పంలో 10 మి.మీ వర్షపాతం నమోదవగా, మిగిలిన మండలాల్లో 10 మి.మీకంటే తక్కువ వర్షం కురిసింది. అక్టోబరు నెలలో 162.7 మి.మీ జిల్లా సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 22.8 శాతం అదనంగా, 199.8 మి.మీ నమోదైంది.

Updated Date - 2021-11-02T06:31:25+05:30 IST