తిరుపతి ఉప ఎన్నికను విజయంతంగా నిర్వహిద్దాం

ABN , First Publish Date - 2021-03-25T05:21:50+05:30 IST

వచ్చే నెల 17వ తేదీ జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌ కోరారు.

తిరుపతి ఉప ఎన్నికను విజయంతంగా నిర్వహిద్దాం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

కలె క్టర్‌ హరినారాయణన్‌ 


చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 24: వచ్చే నెల 17వ తేదీ జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌ కోరారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను తహసీల్దార్లు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ సిబ్బందికి శిక్ష ణ తరగతులు నిర్వహించాలన్నారు. అలాగే అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ను అమలు చేసే విధంగా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్వో మురళి, తిరుపతి స్మార్ట్‌ సిటీ జీఎం చంద్రమౌళి, నోడల్‌ ఆఫీసర్లు, మూడు నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు, ఏఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T05:21:50+05:30 IST