విద్యుదాఘాతంతో అధ్యాపకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-21T06:11:09+05:30 IST

బి.కొత్తకోట మండలంలోని నాయనబావి గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో అధ్యాపకుడి మృతి
విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన నరేష్‌రెడ్డి

బి.కొత్తకోట, ఆగస్టు 20: మండలంలోని నాయనబావి గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బి.కొత్తకోట పోలీసుల కథనం మేరకు... రెడ్డివారిపల్లెకు చెందిన రెడ్డెప్పరెడ్డి కుమారుడు నరేష్‌రెడ్డి... బి.కొత్తకోటలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడు. అలాగే ఇంటిదగ్గర వ్యవసాయ పనులు చేస్తుంటారు. శుక్రవారం వరి మడికి నీళ్లు కట్టేందుకు వెళ్లి వస్తుండగా సర్వీసు వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. నరేష్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-21T06:11:09+05:30 IST