కాణిపాక ఆలయ చైర్ పర్సన్‌గా మహాసముద్రం లత
ABN , First Publish Date - 2021-07-24T05:36:35+05:30 IST
కాణిపాక ఆలయ పాలకమండలి చైర్ పర్సన్‌గా మహాసముద్రం లతకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

పెనుమూరు/ఇరాల, జూలై 23: ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కాణిపాక ఆలయ పాలకమండలి చైర్ పర్సన్‌గా ఇటీవల పెనుమూరు మండలం పులికల్లుకు చెందిన మహాసముద్రం ప్రమీలమ్మకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఆమెకు వయసు, ఆరోగ్యం సహకరించని కారణంగా ఆ కుటుంబసభ్యుల కోరిక మేరకు ఆమె స్థానంలో ఆమె కోడలు మహాసముద్రం లతకు అవకాశం కల్పిస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. ఆమె భర్త దయాసాగర్‌రెడ్డి ప్రస్తుతం వైసీపీ జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాణిపాకం ఆలయ అబివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.