టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2021-10-25T07:36:19+05:30 IST

టీటీడీ ధర్మకర్తల మండలి స భ్యుడిగా కృష్ణమూర్తి వైద్యనాథన్‌ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం లో ప్రమాణస్వీకారం చేశారు.

టీటీడీ బోర్డు సభ్యుడిగా  కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం
కృష్ణమూర్తి వైద్యనాథన్‌కు చిత్రపటం అందజేస్తున్న అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి స భ్యుడిగా కృష్ణమూర్తి వైద్యనాథన్‌ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం లో ప్రమాణస్వీకారం చేశారు. బం గారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత కృష్ణమూర్తి వైద్యనాథన్‌ శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఆయనకు ఽధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్‌ బుక్‌ను అందజేశారు. 

Updated Date - 2021-10-25T07:36:19+05:30 IST