ఫస్ట్ డోసు వేసుకోని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ‘కొవిషీల్డ్’
ABN , First Publish Date - 2021-05-21T06:07:27+05:30 IST
జిల్లాలో 45 ఏళ్లు నిండిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ఇంకా ఫస్ట్ డోసు వేసుకోని వారికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు.

కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు కలెక్టరేట్, మే 20: జిల్లాలో 45 ఏళ్లు నిండిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ఇంకా ఫస్ట్ డోసు వేసుకోని వారికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కొవిడ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. విధుల్లోకి కొత్తగా చేరిన వారితోపాటు బ్యాంకు, ఆర్టీసీ, విద్యుత్, పోస్టల్, టెలికామ్, జైలు, న్యాయ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మొదటి డోసు వ్యాక్సిన్ వేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల నుంచి అర్హులైన వారి జాబితా తెప్పించాలన్నారు. జేసీ రాజశేఖర్, డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీఐవో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా.. కొవిడ్-19 నియంత్రణకు సంబంధించి పీఎం మోదీ దేశవ్యాప్తంగా పలు జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి కలెక్టర్ హరినారాయణన్ హాజరయ్యారు. ఆయనవెంట డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీఆర్వో మురళి ఉన్నారు.