ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోవిడ్ టీకా: అమర రాజా సంస్థ

ABN , First Publish Date - 2021-05-06T01:28:40+05:30 IST

ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోవిడ్ టీకా: అమర రాజా సంస్థ

ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోవిడ్ టీకా: అమర రాజా సంస్థ

తిరుపతి: 18 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి ఉద్యోగికి తప్పకుండా ఉచితంగా కోవిడ్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని అమర రాజా సంస్థ ప్రారంభించింది. బాధ్యతాయుతమైన సంస్థగా సమాజానికి తిరిగి ప్రయోజనం చేకూర్చాలనే సిద్ధాంతానికి కట్టుబడి, అమర రాజా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 18 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి ఉద్యోగికి తప్పకుండా ఉచితంగా కోవిడ్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంస్థ ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తోందని సంస్థ తెలిపింది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న ప్రజలందరికీ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే అమర రాజా సంస్థ ఈ ప్రక్రియను ప్రారంభించిందని సంస్థ వెల్లడించింది.


ఇదే అంశంపై అమర రాజా సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు వైస్ చైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ, “ఈ కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ ప్రభావం అంచనా వేయలేనంతగా మరింత తీవ్రరూపం దాల్చుతుందని వెల్లడించారు. దీనితోపాటు, ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. 

Updated Date - 2021-05-06T01:28:40+05:30 IST