వామ్మో.. కిలో టమోట రేటు ఇంతనా...!

ABN , First Publish Date - 2021-11-23T13:07:50+05:30 IST

ఓ వైపు వర్షాలతో టమోటా పంట దెబ్బతిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా...

వామ్మో.. కిలో టమోట రేటు ఇంతనా...!

చిత్తూరు జిల్లా/మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలకు రెక్కలు వస్తున్నాయి. సోమవారం నాణ్యమైన మొదటి రకం టమోటా గరిష్ఠంగా కిలో రూ.104 పలికింది. గత పదిహేను ఏళ్లలో రికార్డుస్థాయి ధరలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండో రకం కనిష్ఠ ధర కిలో రూ.18 పలికింది. మార్కెట్‌కు 260 మెట్రిక్‌ టన్నుల టమోటా విక్రయానికి వచ్చినా దూరప్రాంతాల వ్యాపారులు రావడంతో ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ఓ వైపు వర్షాలతో టమోటా పంట దెబ్బతిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరో వైపు టమోటా కోత వస్తున్న రైతులు సంతోషంగా వున్నారు.

Updated Date - 2021-11-23T13:07:50+05:30 IST