కర్ణాటక మద్యం సీజ్‌

ABN , First Publish Date - 2021-11-02T05:39:40+05:30 IST

ఎర్రప్పల్లెలో కర్ణాటక మద్యం సీజ్‌ చేశారు.

కర్ణాటక మద్యం సీజ్‌

చౌడేపల్లె, నవంబరు1: ఎర్రప్పల్లెలో కర్ణాటక మద్యం సీజ్‌ చేశారు. ఎస్‌ఐ రవికుమార్‌ కథనం మేరకు.. మండలంలోని శెట్టిపేట పంచాయతీ ఎర్రప్పల్లె గ్రామం కర్ణాటక మద్యానికి అడ్డగా మారింది. మండలంలోని పలు గ్రామాలకు హోల్‌సేల్‌గా సరఫరా అవుతున్నట్లు సమాచారం రావడంతో ఆ గ్రామంపై కొద్ది రోజులుగా ప్రత్యేక నిఘా ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి స్టాకు వచ్చినట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అదేగ్రామానికి చెందిన భూపతి(32) గడ్డివామిలో 1028 పాక్యెట్ల కర్ణాటక మద్యం ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు వెంకటరెడ్డి, బుడ్డా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-02T05:39:40+05:30 IST