కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ. 56.27 లక్షలు
ABN , First Publish Date - 2021-07-08T06:22:23+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 56,27,782 లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం ఈవో వెంకటేశు పర్యవేక్షణలో వరసిద్ధుడి కానుకలను లెక్కించారు.

ఐరాల(కాణిపాకం), జూలై 7:కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 56,27,782 లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం ఈవో వెంకటేశు పర్యవేక్షణలో వరసిద్ధుడి కానుకలను లెక్కించారు. ఈ ఆదాయంలో 32 గ్రాముల బంగారు, 3.220 కిలోల వెండి, 106 యూఎ్‌సఏ డాలర్లు లభ్యమయ్యాయి. ఆలయానికి ఆదాయం 28 రోజుల్లో సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ లెక్కింపులో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, చిట్టెమ్మ, చంద్రశేఖర్, సుధారాణి, సీఎ్‌ఫవో నాగేశ్వరరావు, పర్యవేక్షకులు శ్రీధర్‌బాబు, కోదండపాణి,ఎ్‌సఐలు రమే్‌షబాబు, లోకేష్, యూనియన్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.