కలకడ ఆంధ్రజ్యోతి విలేకరి మృతి

ABN , First Publish Date - 2021-05-05T06:08:18+05:30 IST

కలకడ ఆంధ్రజ్యోతి రిపోర్టరు ఎం.చలపతి (వెంకటాచలపతి) కరోనా కారణంగా మంగళవారం ఉదయం మృతి చెందారు.

కలకడ ఆంధ్రజ్యోతి విలేకరి మృతి
ఎం. చలపతి

కలికిరి, మే 4: కలకడ ఆంధ్రజ్యోతి రిపోర్టరు ఎం.చలపతి (వెంకటాచలపతి) కరోనా కారణంగా మంగళవారం ఉదయం మృతి చెందారు.  సోమవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవగా చికిత్స కోసం తిరుపతి రుయాలో చేరారు. చికిత్స పొందుతూనే మంగళవారం కన్నుమూశారు. కలికిరి మండలం మహల్‌ ఎర్రదొడ్డిపల్లె చలపతి స్వస్థలం. చలపతికి (47) భార్య, ముగ్గురు సోదరులున్నారు.  కలకడ, కలికిరి మండలాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చలపతి మృతికి సంతాపం వెలిబుచ్చారు. 

Updated Date - 2021-05-05T06:08:18+05:30 IST