కబడ్డీ సందడి
ABN , First Publish Date - 2021-12-30T07:33:25+05:30 IST
జాతీయస్థాయి కబడ్డీ పోటీల సన్నాహాల్లో భాగంగా నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

తిరుపతి(విద్య), డిసెంబరు 29: తిరుపతి వేదికగా జనవరి 5నుంచి 9వరకు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీల సన్నాహాల్లో భాగంగా బుధవారం నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ డ్రమ్స్ కొట్టి జెండాను ఊపి ప్రారంభించిన ర్యాలీ కృష్ణాపురం ఠాణా నుంచి నగరపాలక సంస్థ క్రీడామైదానం వరకు కొనసాగింది. విద్యార్థుల కబడ్డీ నినాదాలతో పురవీధులు హోరెత్తాయి.కాగా తిరుపతిలోని ఇందిరామైదానంలో బుధవారం సాయంత్రం నగరవాసులకు అవగాహన కోసం ఎగ్జిబిషన్ కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన ఢిల్లీకి చెందిన ఈఎ్‌సఐసీ జట్టుకు ట్రోఫీ అందజేశారు.