రేపు జ్యువలరీ దుకాణాల సమ్మె

ABN , First Publish Date - 2021-08-22T04:56:54+05:30 IST

నూతన హాల్‌మార్క్‌ విధానానికి వ్యతిరేకంగా సోమవారం జిల్లాలోని జ్యువలరీ దుకాణాలు సమ్మె చేయనున్నట్లు జిల్లా జ్యువలరీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సీఆర్‌సీ రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు జ్యువలరీ దుకాణాల సమ్మె

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 21: నూతన హాల్‌మార్క్‌ విధానానికి వ్యతిరేకంగా సోమవారం జిల్లాలోని జ్యువలరీ దుకాణాలు సమ్మె చేయనున్నట్లు జిల్లా జ్యువలరీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సీఆర్‌సీ రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన హాల్‌మార్క్‌(హెచ్‌యూఐడీ) విధానం వల్ల వినియోగదారుడికి, వ్యాపారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. నూతన విధానానికి నిరసనగా సోమవారం జ్యువలరీ దుకాణాలను మూసివేస్తామని, ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-08-22T04:56:54+05:30 IST