శ్రీవారికి కానుకగా జీపు

ABN , First Publish Date - 2021-08-27T07:06:26+05:30 IST

తిరుమల శ్రీవారికి గురువారం ఓ జీపు కానుకగా అందింది. మహీంద్ర సంస్థ సీఈవో దిలీప్‌ రూ.16 లక్షల విలువైన థార్‌ జీపును అందజేశారు.

శ్రీవారికి కానుకగా జీపు

తిరుమల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి గురువారం ఓ జీపు కానుకగా అందింది. మహీంద్ర సంస్థ సీఈవో దిలీప్‌ రూ.16 లక్షల విలువైన థార్‌ జీపును అందజేశారు. తొలుత శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి దాత అందజేశారు. తర్వాత ధర్మారెడ్డి దాతతో కలిసి వాహనాన్ని కొద్ది దూరం నడిపారు. 

Updated Date - 2021-08-27T07:06:26+05:30 IST