చిరు వ్యాపారుస్థులకు ‘జగనన్న తోడు’
ABN , First Publish Date - 2021-10-21T05:13:59+05:30 IST
చిరు వ్యాపారుస్థులను జగనన్న తోడు పథకం ఎంతో ఆదుకుంటోందని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు.

చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 20: చిరు వ్యాపారుస్థులను జగనన్న తోడు పథకం ఎంతో ఆదుకుంటోందని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాలు వద్ద రూ.122.02 కోట్ల మెగా చెక్ పంపిణీ జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత లబ్ధిదారులు 34380 మందికి రూ.120.35 కోట్లు, పట్టణ ప్రాంత లబ్ధిదారులు 528 మందికి రూ.1.67 కోట్లను ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, జేసీలు రాజశేఖర్, శ్రీధర్, డీఆర్‌డీఏ పీడీ తులసీ, మెప్మా పీడీ రాధమ్మ, లబ్ధిదారులు పాల్గొన్నారు.