ప్రభుత్వ ఉద్యోగులకు కొవిడ్ పాసుల జారీ
ABN , First Publish Date - 2021-05-08T07:03:07+05:30 IST
కర్ఫ్యూ అమలు నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

చిత్తూరు కలెక్టరేట్, మే 7: కర్ఫ్యూ అమలు నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర సర్వీసులైన వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ ఉద్యోగులకు పనివేళల మార్పు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది.మధ్యాహ్నం తరువాత కూడా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కొవిడ్ పాసుల జారీ ప్రక్రియ కలెక్టర్లో శుక్రవారం ప్రారంభమైంది. ఆయా శాఖల జిల్లా అధికారులు ఉద్యోగుల వివరాలతో పాటు ఫొటోలు డీఆర్వోకు అందించాల్సి ఉంది.