ఇంటికే సరుకులంటే ఇలాగేనా?

ABN , First Publish Date - 2021-02-06T05:11:39+05:30 IST

ఇంటికే రేషన్‌ పంపిణీ అనిచెప్పి చివరకు సరుకుల కోసం శుక్రవారం రోడ్డుపై క్యూలో నిలబెట్టారంటూ తిరుపతి జీవకోనలోని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటికే సరుకులంటే ఇలాగేనా?
జీవకోనలో సరుకుల కోసం రోడ్డుపై క్యూలో నిల్చొని ఉన్న లబ్ధిదారులు

రోడ్డులో నిలబెట్టారంటూ లబ్ధిదారుల ఆవేదన 

తిరుపతి(జీవకోన), ఫిబ్రవరి 5: ఇంటికే రేషన్‌ పంపిణీ అనిచెప్పి చివరకు సరుకుల కోసం శుక్రవారం రోడ్డుపై క్యూలో నిలబెట్టారంటూ తిరుపతి జీవకోనలోని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే.. ‘ప్రతినెలా పదో తేదీలోపు చౌకదుకాణాల్లో జనం లేనపుడు, వీలున్నపుడు వెళ్లి సరుకులు తెచ్చుకునే వాళ్లం. ఇపుడు ఇంటికే రేషన్‌ పంపిస్తామని చెప్పి.. రోడ్డుపై ఎండలో నిలబెట్టారు. అదీ వార్డులో ఓ మూల వాహనం నిలబెట్టి.. అక్కడికొచ్చి తెచ్చుకోవాలని వలంటీరు చెప్పారు. దీనికోసం మూడ్రోజులుగా ఇళ్లలోనే ఉండండి.. సరుకులు ఇస్తామని చెబుతూ వచ్చారు. దాంతో కూలీ పనులకు పోకుండా వేచిచూస్తే చివరికిలా చేశారు. దీనిపై వలంటీరును ప్రశ్నిస్తే.. తమకేమీ తెలియదంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం చెప్పిన విధంగా ఇంటింటికీ సరుకులు పంపిణీ చేయాలి’ అని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-02-06T05:11:39+05:30 IST