ఆర్‌ఎంపీని రక్షించిన ఐరాల ఎస్‌ఐ

ABN , First Publish Date - 2021-08-27T06:38:12+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ ఆర్‌ఎంపీని ఐరాల ఎస్‌ఐ లోకేష్‌ రక్షించారు.

ఆర్‌ఎంపీని రక్షించిన ఐరాల ఎస్‌ఐ
నరసింహారెడ్డితో మాట్లాడుతున్న ఎస్‌ఐ లోకేష్‌

ఐరాల, ఆగస్టు 26: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ ఆర్‌ఎంపీని ఐరాల ఎస్‌ఐ లోకేష్‌ రక్షించారు. ఉప్పరపల్లెకు చెందిన నరసింహారెడ్డి నాంపల్లెలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి తన క్లినిక్‌లో పని ముగించు కుని ఇంటి వెళుతుండగా పొలకల వద్ద రోడ్డుకు అడ్డుగా కుక్క రావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. గాయపడిన ఆయన్ను గంట వరకు ఎవ్వరూ గమనించలేదు. రాత్రి పెట్రోలింగ్‌లో భాగంగా పాటూరు వైపు వెళుతున్న ఎస్‌ఐ చూసి.. నరసింహారెడ్డిని వెంటనే ఐరాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా ఎస్‌ఐని స్థానికులు ప్రశంసించారు. 

Updated Date - 2021-08-27T06:38:12+05:30 IST