సెక్టోరియల్ అధికారుల నియామకాలకు నేడు ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2021-09-04T05:11:58+05:30 IST
సమగ్రశిక్షలో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న సెక్టోరియల్ అధికారుల నియామకాలకు గ్రీన్స్ సిగ్నల్ లభించింది. కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలతో మేరకు శనివారం జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం చాంబర్‌లో సెక్టోరియల్ అధికారుల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 3: సమగ్రశిక్షలో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న సెక్టోరియల్ అధికారుల నియామకాలకు గ్రీన్స్ సిగ్నల్ లభించింది. కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలతో మేరకు శనివారం జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం చాంబర్‌లో సెక్టోరియల్ అధికారుల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఏఎంవో ఉర్దూకు రెగ్యులర్, ఐఈ(సహిత విద్య) సహాయ కోర్డినేటర్ ఇన్‌చార్జి మినహా మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సీఎంవో, పాఠశాల కోఆర్డినేటర్, సహాయ కోఆర్డినేటర్, జీసీడీవో పోస్టుల్లోని అధికారులు ఇన్‌చార్జిలుగా ఉన్నారు. ఈ పోస్టుల్లోనూ రెగ్యులర్ అధికారులు లేరు. కాగా ఏఎంవో, సహాయ ఏఎంవో (తెలుగు), సహాయ సీఎంవో, సహాయ గణాంకాధికారి, ప్రణాళిక అధికారి, సహాయ ప్రోగ్రామింగ్ అధికారి, సహాయ జీసీడీవో, సహిత విద్య కోఆర్డినేటర్, సహాయ కోఆర్డినేటర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. వీటన్నింటిని భర్తీ చేసేందుకు ఐదు నెలల కిందటే నోటిఫికేషన్ జారీ చేయగా దాదాపు 35 దరఖాస్తులు వచ్చాయి. అయితే కరోనా కారణంగా పాఠశాలలు మూతబడటంతో ఈ పోస్టులు భర్తీకి నోచుకోలేదు.