కత్తి మహేశ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2021-07-13T05:16:05+05:30 IST

సినీ విమర్శకుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ ఆశయాలు ఆఽధునిక సమాజంలోని యువతకు స్ఫూర్తిదాయకమని వీసీకే పార్టీ వ్యవస్థాపకుడు తిరుమావళవన్‌ పేర్కొన్నారు.

కత్తి మహేశ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయకం
తిరుమావళవన్‌

వీసీకే పార్టీ వ్యవస్థాపకుడు తిరుమావళవన్‌ 

పీలేరు, జూలై 12: సినీ విమర్శకుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ ఆశయాలు ఆఽధునిక సమాజంలోని యువతకు స్ఫూర్తిదాయకమని వీసీకే పార్టీ వ్యవస్థాపకుడు తిరుమావళవన్‌ పేర్కొన్నారు. సోమవారం ఎర్రావారిపాళెం మండలం యల్లమందలో జరిగిన కత్తి మహేశ్‌ అంత్యక్రియల్లో ఆ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు (వీసీకే అనుబంధం సంఘం ‘బాస్‌’ ) పీటీఎం శివప్రసాద్‌ పాల్గొన్నారు. పార్టీ అధినేత తిరుమా వళవణ్‌ సంతాప సందేశం తెలియజేశారు. హేతువాద దృక్పథంతో సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలపై సూటిగా మాట్లాడే యువ రచయితను, సినీ విశ్లేషకుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయని  పేర్కొన్నారు. కత్తి మహేష్‌ కులవ్యవస్థ నిర్మూలనపై సైద్ధాంతిక పోరు సాగించారని తెలియజేశారు. కత్తి మహేశ్‌ కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2021-07-13T05:16:05+05:30 IST