ఎర్ర చందనం స్మగ్లర్లపై నిఘా పెంచండి

ABN , First Publish Date - 2021-10-19T07:35:07+05:30 IST

ఎర్ర చందనం పరిరక్షణలో భాగంగా స్మగ్లర్లపై మరింత నిఘా పెంచాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ సిబ్బందికి అనంతపురం రేంజ్‌ డీఐజీ క్రాంతిరాణా టాటా పిలుపునిచ్చారు.

ఎర్ర చందనం స్మగ్లర్లపై నిఘా పెంచండి
సిబ్బందికి సూచనలిస్తున్న అనంతపురం రేంజ్‌ డీఐజీ క్రాంతిరాణా టాటా

టాస్క్‌ఫోర్సు సిబ్బందికి డీఐజీ క్రాంతిరాణా టాటా ఆదేశం 


తిరుపతి (కపిలతీర్థం), అక్టోబరు 18: ఎర్ర చందనం పరిరక్షణలో భాగంగా స్మగ్లర్లపై మరింత నిఘా పెంచాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ సిబ్బందికి అనంతపురం రేంజ్‌ డీఐజీ క్రాంతిరాణా టాటా పిలుపునిచ్చారు. తిరుపతి నగరం కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఎర్రచందనం పరిరక్షణపై చర్చించారు. శేషాచల అడవుల్లో ఎర్ర చందనం వృక్షాలున్న ప్రాంతాలను మ్యాప్‌ల ద్వారా  గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాలకు స్మగ్లర్లు ఎలా వెళ్తున్నారనే మార్గాలను గుర్తించి నిఘా ఎలా ఉండాలో అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. అవసరమైతే పక్క జిల్లాల పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇది వరకే పక్క జిల్లాల పోలీసులతో సంయుక్తంగా చేపడుతున్న కూంబింగ్‌ ఫలితాలను డీఐజీకి అధికారులు వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కృషి చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బందిని డీఐజీ అభినందించారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందర రావు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, డీఎస్పీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T07:35:07+05:30 IST