చేతకాని సీఎం తప్పుకోవాలి: టీఎన్‌ఎస్‌ఎఫ్
ABN , First Publish Date - 2021-12-31T06:45:10+05:30 IST
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు న్యాయం చేయలేని సీఎం జగన్ పదవి నుంచి తప్పుకోవాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేశ్ డిమాండ్ చేశారు.

మదనపల్లె టౌన్, డిసెంబరు 30: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు న్యాయం చేయలేని సీఎం జగన్ పదవి నుంచి తప్పుకోవాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం మదనపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లు పొందాలని ఎదురు చూస్తున్న విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్ వారి భవిష్యత్‌ను తారుమారు చేస్తోందన్నారు. ఏపీ ఈఏపీసెట్‌లో 1.34లక్షల మంది విద్యార్థులు అర్హత సాధిస్తే మూడు విడత్లో కలిపి 45వేల సీట్లు ఇంకా భర్తీకి నోచుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వారం రోజుల్లో సీట్లు భర్తీ చేయకుంటే టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గండికోట గణేష్, సురేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.