మంత్రుల బాటలో...

ABN , First Publish Date - 2021-12-19T05:51:10+05:30 IST

తవణంపల్లె మండల సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ గీతాహరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ముఖ్య అతిధిగా హాజరైన ఈ సమావేశానికి రావాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశం ప్రారంభం కాగానే మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సమక్ష్యంలో ఎంపీడీవో ప్రకటించారు.

మంత్రుల బాటలో...

మండల మీట్‌కు మీడియా నోఎంట్రీ


తవణంపల్లె, డిసెంబరు 18: తవణంపల్లె మండల సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ గీతాహరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ముఖ్య అతిధిగా హాజరైన ఈ సమావేశానికి రావాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశం ప్రారంభం కాగానే మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సమక్ష్యంలో ఎంపీడీవో ప్రకటించారు. ఆహ్వానించి బయటకు పంపండం ఏంటని విలేకరులు ప్రశ్నించగా సమావేశం ముగిశాక వివరాలు వెల్లడిస్తామని ఎంపీడీవో చెప్పారు. 

Updated Date - 2021-12-19T05:51:10+05:30 IST