నూతన విద్యావిఽధానంతో మెరుగైన ఫలితాలు: ఆర్జేడీ

ABN , First Publish Date - 2021-12-07T06:12:03+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిఽధానంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

నూతన విద్యావిఽధానంతో మెరుగైన ఫలితాలు: ఆర్జేడీ
మోడల్‌స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి

 కురబలకోట, డిసెంబరు 6: ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిఽధానంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా పాఠశాల, అంగళ్లు జడ్పీహైస్కూల్‌, ప్రాథమిక పాఠశాలలను  సోమవారం ఆయన తనిఖీ చేశారు. ముదివేడు క్రాస్‌  సమీపంలోని ఉన్న మోడల్‌స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు ఇంజనీరింగ్‌, వైద్య విద్యపై అవగాహన కల్పించాలన్నారు.  ఈ సందర్భంగా అంగళ్లు జడ్పీహైస్కూల్‌లో తరగతి గదుల కొరత ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు.  ఎంఈవో ద్వారకనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:12:03+05:30 IST