ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా హుస్సేన్‌

ABN , First Publish Date - 2021-05-21T06:25:51+05:30 IST

ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ హుస్సేన్‌ నియమితులయ్యారు.

ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా హుస్సేన్‌
బాధ్యతలు స్వీకరిస్తున్న హుస్సేన్‌

ఉత్తర్వులు జారీ, బాధ్యతల స్వీకరణ


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 20: ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ హుస్సేన్‌ నియమితులయ్యారు. ప్రొఫెసర్‌ శ్రీధర్‌రెడ్డి స్థానంలో ఈయన్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ వెంటనే హుస్సేన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు. ‘ఇక్కడే చదివా. ప్రొఫెసర్‌గా పని చేశా. యూనివర్సిటీ పరిస్థితుల మీద కొంత అవగాహన ఉంది. గతంలో డీన్‌గా పనిచేసిన అనుభవంతో  అభివృద్ధికి కృషి చేస్తా. విద్యార్థులు, ఉద్యోగులకు అందుబాటులో ఉంటా’నని ఆయన తెలిపారు. 


హుస్సేన్‌ నేపథ్యం...

కడప జిల్లా రాయచోటికి చెందిన ఈయన ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చదివారు. 1990లో పీహెచ్‌డీ చేశారు. 1991లో ప్యారిస్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా పని చేశారు. 1992లో ఎస్వీయూ ఫిజిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరి.. 2009లో ప్రొఫెసర్‌ అయ్యారు. గతంలో ఫిజిక్స్‌ విభాగాధిపతిగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీవోఎస్‌) చైర్మన్‌గా, వర్సిటీ డెవలప్‌మెంట్‌ డీన్‌గా వ్యవహరించారు. పలు అంశాలపై 194 పరిశోధన పత్రాలను రూపొందించారు. 50 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. 10 ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టులను నిర్వహించారు. 19 పీహెచ్‌డీ, 9 ఎంఫిల్‌ డిగ్రీలు ఈనయయ పర్యవేక్షణలో పూర్తయ్యాయి. మెటల్‌ ఆక్సైడ్‌, బయో సెన్సార్స్‌ అండ్‌ బయో ఎలకా్ట్రనిక్స్‌ అంశాలపై రెండు పుస్తకాలు రాశారు. వివిధ అవార్డులూ పొందారు. 

Updated Date - 2021-05-21T06:25:51+05:30 IST