భర్త అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-07-13T05:21:41+05:30 IST

భర్త అదృశ్యంపై భార్య పోలీసులను ఆశ్రయించింది.

భర్త అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు

సోమల, జూలై 12: భర్త అదృశ్యంపై భార్య పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. సోమల పంచాయతీ చెన్నయ్యగారిపల్లెకు చెందిన సింగంశెట్టి సుబ్రహ్మణ్యం (45) చంద్రకళ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. ఆదివారం పొలంవద్ద పనులు చేస్తుండగా ఆ మార్గంలో దిడ్డివారి పల్లెకు చెందిన శ్రీరాములు, రాజేశ్‌తో కలిసి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

Updated Date - 2021-07-13T05:21:41+05:30 IST