భర్తను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2021-02-06T05:02:08+05:30 IST

మద్యానికి బానిసై వేధింపులకు పాల్పడుతున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన శాంతిపురం మండలంలో చోటు చేసుకుంది.

భర్తను హత్య చేసిన భార్య
లోకేష్‌నాయుడు మృతదేహం

శాంతిపురం, ఫిబ్రవరి 5: మద్యానికి బానిసై వేధింపులకు పాల్పడుతున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన శాంతిపురం మండలంలో చోటు చేసుకుంది. రాళ్ళబూదగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ కథనం మేరకు ... బెళ్ళకోగిలకు చెందిన సుజాత(34), పెనుమూరుకు చెందిన లోకేష్‌నాయుడు(38) భార్యాభర్తలు. వారికి దివ్య, మౌనిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కొంతకాలంగా లోకేష్‌నాయుడు తాగుడుకు బానిసై భార్యతో గొడవపడుతూ వేధింపులకు గురిచేసేవాడు. పలుసార్లు ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీలు నిర్వహించి సర్ధిచెప్పారు. అయినా లోకేష్‌నాయుడులో మార్పు రాలేదు. దీంతో సుజాత స్వగ్రామానికి పిల్లలతో వచ్చి, స్థానిక ఇటుకుల పరిశ్రమలో పనిచేస్తోంది. రెండురోజుల క్రితం లోకేష్‌నాయుడు వచ్చి పిల్లలతోపాటు తనతో రావాలని భార్యను కోరాడు. కొన్నిరోజుల తర్వాత వస్తానని సుజాత చెప్పడంతో, లోకేష్‌ కూడా ఇటుకల పరిశ్రమలో పనికి కుదిరాడు. గురువారం రాత్రి సుజాత, లోకేష్‌ మధ్య ఏం జరిగిందో ఏమో సుజాత లోకేష్‌ను హత్యచేసి పొలాల్లో పడేసి రాళ్ళబూదుగూరు పోలీస్‌స్టేషనులో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కోల్పోయిన ఇద్దరు చిన్నారు అనాథలుగా మిగిలారు.

Updated Date - 2021-02-06T05:02:08+05:30 IST