భార్య హత్య కేసులో భర్త అరెస్టు

ABN , First Publish Date - 2021-11-02T05:37:47+05:30 IST

భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు చౌడేపల్లె రూరల్‌ సీఐ మధు సూదన్‌రెడ్డి తెలిపారు.

భార్య హత్య కేసులో భర్త అరెస్టు
నిందితుడు వెంకటస్వామిని, హత్యకు ఉపయోగించిన కర్రను చూపుతున్న సీఐ

సదుం, నవంబరు 1: భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు చౌడేపల్లె రూరల్‌ సీఐ మధు సూదన్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మొరవ పల్లె పంచాయతీ సీతన్నగారి ఇండ్లుకు చెందిన వెంకటస్వామి తన భార్య దేవరాజులమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో గత నెల 29న శుక్రవారం ఉదయం పొలం వద్ద భార్యను హత్య చేసినట్లు ఆయన కుమారుడు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు వెంకటస్వామిని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం అదుపు లోకి తీసుకున్నారు. పీలేరు కోర్టులో హాజరు పరిచారు. 
Updated Date - 2021-11-02T05:37:47+05:30 IST