ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాలు రద్దు

ABN , First Publish Date - 2021-08-28T05:06:16+05:30 IST

హౌసింగ్‌ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకపోతే స్థలాలను రద్దు చేస్తామని తహసీల్దార్‌ పుల్లారెడ్డి , హౌసింగ్‌ డీఈ గోపాల్‌నాయక్‌ స్పష్టం చేశారు.

ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాలు రద్దు
హౌసింగ్‌ లబ్ధిదారులతో మాట్లాడుతున్న డీఈ గోపాల్‌నాయక్‌

పీలేరు, ఆగస్టు 27: హౌసింగ్‌ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకపోతే స్థలాలను రద్దు చేస్తామని తహసీల్దార్‌ పుల్లారెడ్డి , హౌసింగ్‌ డీఈ గోపాల్‌నాయక్‌ స్పష్టం చేశారు. పీలేరు మండలం దొడ్డిపల్లె పంచాయతీ బంగారంచు గ్రామంలో శుక్రవారం వారు పర్యటించారు. కాలనీ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఈ గ్రామంలో 235 మందికి ఇళ్ల పట్టాలు, కాలనీ ఇళ్లు మంజూరు చేయగా అత్యధికులు నిర్మాణాలను ప్రారంభించలేదు. దీంతో రెండు, మూడు రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, లేనిపక్షంలో ఇళ్ల పట్టాలను రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సురేష్‌కుమార్‌రెడ్డి, సచివాలయ ఇంజనీరింగ్‌ సహాయకులు, హౌసింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-28T05:06:16+05:30 IST