ఎక్కడికక్కడ టీడీపీ నాయకుల గృహ నిర్బంధం
ABN , First Publish Date - 2021-10-21T05:43:35+05:30 IST
రాష్ట్రంలో అంబే డ్కర్ రాజ్యాంగం పోయి, వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని రాజంపేట టీడీపీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వై.దొరస్వామినాయుడు ధ్వజమెత్తారు. బుధవారం మదనపల్లె పట్టణంలో బంద్ నిర్వహణకు టీడీపీ నేతలు మంగళ వారం రాత్రి నుంచే సన్నాహాలు మొదలెట్టారు. విష యం తెలుసుకున్న పోలీసులు వేకువ ఝామునుంచే ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు.

మదనపల్లె టౌన్, అక్టోబరు 20: రాష్ట్రంలో అంబే డ్కర్ రాజ్యాంగం పోయి, వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని రాజంపేట టీడీపీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వై.దొరస్వామినాయుడు ధ్వజమెత్తారు. పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు బుధవారం మదనపల్లె పట్టణంలో బంద్ నిర్వహణకు టీడీపీ నేతలు మంగళ వారం రాత్రి నుంచే సన్నాహాలు మొదలెట్టారు. విష యం తెలుసుకున్న పోలీసులు వేకువ ఝామునుంచే ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మునగమాకులపల్లెలో టీడీపీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసుల చట్టం వైసీపీకి చుట్టంగా మారిందన్నారు. పెంచుపాడుస్వామి, కొప్పల రమణ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబును కమ్మవీధిలో హౌస్ అరెస్టు చేశారు. పార్లమెంటరీ అధికార ప్రతి నిధి ఆర్‌జే వెంకటేష్‌ను నిమ్మనపల్లె మండలం రాచ వేటివారిపల్లె వద్ద హౌస్‌అరెస్టు చేశారు. కార్యనిర్వాహక కార్యదర్శి పఠాన్‌ఖాదర్‌ఖాన్‌ను దక్నీపేటలో నిర్బం ధిం చారు. కాగా తెలుగు యువత నాయకుడు నాదెళ్ల అరుణ్‌తేజ్, ప్రణయ్‌రాయల్ తదితరులు పోలీసుల కళ్లుగప్పి అవెన్యూరోడ్డులో నిరసన తెలిపారు. టీడీపీ జెండాలు చేతపట్టుకుని గుండారాజ్యం నశించాలని నినాదాలు చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి సాయిచందు, అఖిల్ తదితరులు పుంగనూరురోడ్డులోని ప్రైవేటు కళాశాల వద్ద నిరసన తెలిపారు. కాగా నిరసన చేస్తున్న అరుణ్‌తేజ్, రానా, శివకృష్ణ తదిత రులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్.గుర్రప్పనాయుడు వైసీపీ ప్రభుత్వతీరుపై ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకుడు ఎస్.ఏ.మస్తాన్‌ను మోతీనగర్‌లో హౌస్ అరెస్టు చేశారు.
ములకలచెరువు: మండల కేంద్రంలో బుధవారం ధర్నా కు బయలుదేరిన టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ కార్య నిర్వాహక కార్యదర్శి యర్రగుడి సురేష్, నాయకులు పాలగిరి సిద్ధా, మూగి రవిచంద్ర, గంగులప్ప, రమణారెడ్డి, నాగమల్లప్ప, శ్రీనివాసులు, వెంకటస్వామి, గంగాధర్, షాకీర్, సుధాకర్‌నాయుడు, రమణమూర్తి, గంగాధర్, రెడ్డెప్ప, గంగాదేవి తదితరులు బంద్ చేప ట్టేందుకు పెట్రోల్ బంకు నుంచి ర్యాలీగా బయలు దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెట్రోల్ బంకు వద్దకు చేరుకుని నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం నాలుగు గంటలకు విడిచిపెట్టారు. అలాగే టీడీపీ మం డల అధ్యక్షుడు గుత్తికొండ త్యాగరాజును తెల్లవారు జామున దేవళచెరువులో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా త్యాగరాజు, సురేష్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనివ్వని ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.

బి.కొత్తకోట: బి.కొత్తకోటలో టీడీపీ నేతలు బుధవారం చేపట్టిన బంద్‌ను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.ఎం.పర్వీన్‌తాజ్‌ను హౌస్ అరెస్టు చేయడాన్ని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు ఆమె నివాసానికి పెద్దసంఖ్యలో చేరుకు న్నారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజంపేట పార్లమెం టరీ టీడీపీ అధికార ప్రతినిధి మొటుకు శివ, నాయ కులు డేరింగుల నారాయణ, రవికుమార్, గట్టు చంద్ర న్న, ఆంజి, శివారెడ్డి, తాతప్ప, మస్తాన్‌రెడ్డి, రమ ణా రెడ్డి, పద్మనాభం, శంకర్, మదార్‌సాహెబ్, రంగారెడ్డి, శ్రీనాథ్, పలక రవి, హరి తదితరులు పాల్గొన్నారు.

రామసముద్రం: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ రామస ముద్రంలో ధర్నా నిర్వహించారు. దిగువపేట నుంచి ర్యాలీగా చెక్‌పోస్టు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీతప్ప, నారాయణరెడ్డి, కృష్ణంరాజు, శివశంకర్, చెంగారెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు.

మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌తో కలసి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కురబలకోట: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రే ణులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం బంద్‌ను చేపట్టనుండగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముదివేడులో టీడీపీ రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్రయాదవ్, మాజీ సర్పంచ్ వై.జి.రమణ, దాదం వారిపల్లెలో రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్ బాషా, ఆర్సీకురవపల్లెలో రుద్ర బాలకృష్ణ, మండెంవారిపల్లెలో ఉప సర్పంచ్ బొగ్గు భాస్కర్ తదితరులను హౌస్ అరెస్టు చేశారు.
నిమ్మనపల్లె: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేయడంపై మండలంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపేందుకు ఇళ్లనుంచి బయలుదేరుతుండగా పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. వైసీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గపడ్డాయని నాయకులు ఆర్జే వెంకటేష్, రెడ్డెప్పరెడ్డి, సుధాకర్, మల్లికార్జున, రాజన్న తదితరులు మండిపడ్డారు.
పెద్దమండ్యం: పెద్దమండ్యం బస్టాప్ వద్ద ఉన్న టీడీ పీ మండల అధ్యక్షుడు సిద్దవరం ప్రసాద్ నాయకులు గంగాధర, రసూల్, కాలేషా, రెడ్డిహుసేన్, మహేష్, పెద్దన్న, సాంబ, ఓబులేసు తదితరులను ఎస్‌ఐ వెంకటేష్ అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ... టీడీపీ కార్యా లయాలపై దాడులు చేయడం మంచి సంస్కృతి కాదన్నారు. దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి చేటన్నారు.