వాన ముప్పు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు

ABN , First Publish Date - 2021-11-09T07:06:04+05:30 IST

జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలు తదితర ఇబ్బందులున్న ప్రాంతాల్లో స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

వాన ముప్పు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 8: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలు తదితర ఇబ్బందులున్న ప్రాంతాల్లో స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ను సంప్రదించి, అతని అనుమతితో సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. సెలవు ప్రకటించిన పాఠశాలల జాబితాను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు డీఈవో కార్యాలయానికి, కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు అందించాలని కలెక్టర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-11-09T07:06:04+05:30 IST