స్కిట్ మూసివేతపై హైకోర్టు స్టే
ABN , First Publish Date - 2021-12-31T08:16:28+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల మూసివేత నిర్ణయంపై గురువారం హై కోర్టు స్టే విధించింది.

శ్రీకాళహస్తి, డిసెంబరు 30: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల మూసివేత నిర్ణయంపై గురువారం హై కోర్టు స్టే విధించింది. అడ్మిషన్లు లేకపోవడంతో కళాశాలను మూసివేయడం తప్ప మరో ప్రత్యా మ్నాయం లేదంటూ శ్రీకాళహస్తీశ్వ రాలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా కళాశాల మూసివేతపై పలువురు బోధనే తర సిబ్బంది న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎనిమిది వారాలపాటు స్టే విధించింది. జనవరి 24న మూసి వేత అంశంపై ఇరు వర్గాల వాదనలు వినిపించాల్సిందిగా హై కోర్టు పేర్కొన్నట్లు బోధనేతర సిబ్బంది తెలిపారు.