నేడు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2021-11-28T07:09:14+05:30 IST

వాతావరణ శాఖ జిల్లాకు మళ్లీ భారీ వర్ష సూచన చేసింది. శనివారం ఆ శాఖ జారీ చేసిన ప్రకటనలో శని, ఆదివారాల్లో భారీ నుంచీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

నేడు భారీ వర్ష సూచన

తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వాతావరణ శాఖ జిల్లాకు మళ్లీ భారీ వర్ష సూచన చేసింది. శనివారం ఆ శాఖ జారీ చేసిన ప్రకటనలో శని, ఆదివారాల్లో భారీ నుంచీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఆ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు అధికార యంత్రాంగానికీ, ఇటు ప్రజానీకానికి సూచించింది. ఆదివారం జిల్లాలో పలుచోట్ల 7 సెంటీ మీటర్ల నుంచీ గరిష్టంగా 20 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఈనెల 18వ తేదీన కూడా తిరుమలతో సహా పలు మండలాల్లో 20  సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతోనే ఆయా చోట్ల వర్షపు నీరు కాస్తా వరదగా మారి పలు ప్రాంతాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ తగిన ముదు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - 2021-11-28T07:09:14+05:30 IST