జిల్లా అధికారులకు ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను అందించిన హెచ్‌సీసీబీ
ABN , First Publish Date - 2021-05-21T05:00:41+05:30 IST
కోవిడ్–19తో జరుగుతున్న పోరాటంలో భాగంగా భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హెచ్‌సీసీబీ(హిందుస్తాన్ కోకా కోలా బేవరేజస్), జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఎవర్ ఫ్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను..

చిత్తూరు: కోవిడ్–19తో జరుగుతున్న పోరాటంలో భాగంగా భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హెచ్‌సీసీబీ(హిందుస్తాన్ కోకా కోలా బేవరేజస్), జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఎవర్ ఫ్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను అందజేసింది. ఈ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను చిత్తూరు జిల్లా ఆరోగ్య, వైద్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్యకు కంపెనీ సిబ్బంది అందజేశారు. ఈ తోడ్పాటును హెచ్‌సీసీబీ దేశవ్యాప్త కోవిడ్ కేర్ ప్లాన్‌లో భాగంగా అందజేసింది. ఈ కోవిడ్ కేర్ ప్లాన్‌లో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు, ఉచితంగా ఆహార పొట్లాలు, శీతల పానీయాలను అవసరార్థులకు పంపిణీ చేయడం, ఐసీయు, ఇతర అత్యవసర వైద్య యంత్ర సామాగ్రిని ప్రభుత్వ, చారిటబుల్ ఆస్పత్రులకు విరాళంగా అందిస్తోంది. అలాగే టీకా శిబిరాలు, మద్దతు కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తోంది దేశంలో పలు ప్రాంతాలలో ఇప్పటికే ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను హెచ్‌సీసీబీ పంపిణీ చేసింది. తద్వారా తగినంత ఆక్సిజన్ సరఫరా లేక సతమతవుతున్న అనేకమంది బాధితులకు అండగా నిలస్తోంది. హెచ్‌సీసీబీ అందించిన తోడ్పాటును జిల్లా యంత్రాంగం ప్రశంసించడంతో పాటుగా భవిష్యత్‌లో కూడా ఇదే విధమైన తోడ్పాటును అందుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేసింది.