రూ.14 లక్షల విలువైన గుట్కా సీజ్
ABN , First Publish Date - 2021-10-21T06:37:12+05:30 IST
కర్ణాటక నుంచి గంగవరం మీదుగా తరలిస్తున్న రూ.14.50 లక్షల విలువైన గుట్కా, మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

ఇద్దరు నిందితుల అరెస్టు
గంగవరం, అక్టోబరు 20 : కర్ణాటక నుంచి గంగవరం మీదుగా తరలిస్తున్న రూ.14.50 లక్షల విలువైన గుట్కా, మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. సీఐ రామకృష్ణాచారి వివరాల మేరకు.... బుధవారం ఉదయం గండ్రాజుపల్లె చెక్‌పోస్ట్ వద్ద ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డితో పాటు సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తుండగా లారీ రాగా ఆపి తనిఖీలు నిర్వహించారు. లారీలో ఉన్న లోడ్‌ను చెక్‌చేయగా భారీగా గుట్కా ప్యాకెట్ల బస్తాలు, మద్యం కేసులు బయటపడ్డాయన్నారు. రూ.33,724 విలువచేసే కర్ణాటక మద్యం, నిషేధిత గుట్కా ఉత్పత్తులు రూ.14,16,275 తోపాటు లారీని సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. తమిళనాడుకు చెందిన లారీడ్రైవర్ ఇలంగోవన్(39), క్లీనర్ తంగరాజ్(21)లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచామన్నారు.