వైద్య సిబ్బందికి మాస్కులూ కరువే

ABN , First Publish Date - 2021-05-20T05:50:06+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి కనీసం మాస్కులూ కరువవయ్యాయని ఏఐటీయూసీ నేత గురవయ్య వాపోయారు

వైద్య సిబ్బందికి మాస్కులూ కరువే
సమావేశంలో మాట్లాడుతున్న గురవయ్య

 శ్రీకాళహస్తి అర్బన్‌, మే 19: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎనలేని సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా వర్కర్లకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉందని ఏఐటీయూసీ మండల గౌరవాధ్యక్షుడు జనమాల గురవయ్య డిమాండ్‌ చేశారు. పట్టణ సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లోవ్స్‌ తదితర రక్షణ సామగ్రి కూడా సరఫరా కావడం లేదని వాపోయారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-20T05:50:06+05:30 IST