కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-06-22T04:52:54+05:30 IST

కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కిశోర్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

 నల్లారి కిశోర్‌ విమర్శ

కలికిరి, జూన్‌ 21: కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కిశోర్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. కలకడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి చెందిన వారికి పింఛన్లు, చేయూత పథకాలు అందకుండా అధికార పార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీని పైన ఆయా మండలాల్లో ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.కలికిరి, కలకడ మండలాల్లో కరోనా బారినపడి మృతి చెందిన పలు టీడీపీ కుటుంబాలను కిశోర్‌ పరా మర్శించారు. కలికిరిలో మాజీ ఎంపీటీసీ కుటుంబాల్లో మృతి చెందిన సత్యారెడ్డి, అజంతుల్లా చిన్నకిష్షూ (వెంకటేశ్వరరావు) కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. వల్లీ మేస్త్రీ, మేస్త్రీ సాహెబ్‌పీర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉపాధ్యాయులు రామ్మోహన్‌ రెడ్డి, రాజా రెడ్డి, కాంతం రెడ్డి కుటుంబాలను ఓదార్చారు. భార్యలను కోల్పోయిన షాహూర్‌, జాకీర్‌లకు సానుభూతి వ్యక్తం చేశారు. గుట్టపాళెం వెళ్ళి నాగ రాజ కుటుంబీకులకు ఆసరాగా వుంటానని భరోసానిచ్చారు. దొడ్డిపల్లెలో కరోనాతో మరణించిన రెడ్డెప్ప కుటుంబాన్ని పరామర్శించారు. కరోనా సోకి కోలుకున్న రాతిగుంటపల్లె, కదిరాయచెరువు సర్పంచులు అలివేల మ్మ, లక్ష్మీప్రసన్న దొడ్డిపల్లె చౌదరి కుటుంబాలను పరామర్శించారు. మం డల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌, ఉపాధ్యక్షుడు ఆర్టీసీ రెడ్డె ప్పరెడ్డి, మాజీ ఎంపీపీ రహంతుల్లా, ముస్తాఫా హజరత్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌, జిల్లా ప్రచార కార్యదర్శి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, సర్పంచులు గుర్రం శివప్రసాద్‌, విశ్వనాథం, అలి వేలమ్మ, లక్ష్మీప్రసన్న, నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చౌదరి, వెంకట్రమణ, తారకేశ్వర్‌, మల్లికార్జున కిశోర్‌ వెంట ఉన్నారు.

Updated Date - 2021-06-22T04:52:54+05:30 IST