బీటీ కళాశాల ప్రభుత్వపరానికి చర్యలు

ABN , First Publish Date - 2021-11-23T06:54:13+05:30 IST

జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసే లా బీసీటీ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కొస్తామని పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ అన్నారు. బీటీ కళాశాల వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ దీక్షకు అఖిలపక్షం నాయకులు సంఘీభావం తెలిపారు.

బీటీ కళాశాల ప్రభుత్వపరానికి చర్యలు
అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డియాదవ్‌

మదనపల్లె టౌన్‌, నవంబరు 22: జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసే లా బీసీటీ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కొస్తామని పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ అన్నారు.  బీటీ కళాశాల వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ దీక్షకు అఖిలపక్షం నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం బిసెంట్‌ హాల్లో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు వురు వారి అభిప్రాయాలను వెల్లడించారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ... చరిత్ర కలిగిన బీటీ కళాశాల నేడు దుస్థితికి చేరుకోవడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని మంత్రి పెద్ది రెడ్డి, ఎంపీ మిఽథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషా దృష్టికి తీసుకెళతామన్నారు.  తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, జనసేన రాయ లసీమ కోకన్వీనర్‌ రాందాస్‌చౌదరి మాట్లాడుతూ... బీటీ కళాశాలను ప్రభుత్వం  వర్శిటీ స్థాయికి పెంచాలని, ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జ్ఞానాంబిక విద్యాసంస్థల కరస్పాండెంట్‌ ఆర్‌.గురుప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జింకా వెంకటాచలపతి, రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్‌, పూర్వ విద్యార్థుల సంఘాల చైర్మన్లు కంభం నాగభూషణరెడ్డి, పార్థసారథి ప్రసం గించారు. బీఎస్పీ నాయకుడు బందెల గౌతమ్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు ఉత్తన్న, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నవీన్‌కుమార్‌, మాధవ్‌, లావణ్య, జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T06:54:13+05:30 IST