శహభాష్‌.. గోపి!

ABN , First Publish Date - 2021-05-19T05:29:11+05:30 IST

శ్రీకాళహస్తి మండలానికి చెందిన కొవిడ్‌ బాధితుడు గంగరామయ్యకు ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకుడు గోపి ఆక్సిజన్‌ అందజేసి మానవత్వం చాటుకున్నారు.

శహభాష్‌.. గోపి!
గంగరామయ్యకు ఆక్సిజన్‌ అందిస్తున్న గోపి

శ్రీకాళహస్తి, మే 18: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడికి ఆక్సిజన్‌ అందజేసి ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకుడు మానవత్వం చాటుకున్నారు. వివరాలివీ... శ్రీకాళహస్తి మండలం ముద్దమూడికి చెందిన గంగరామయ్య(62) కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఆయన్ను మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అయితే పడకలు లేవనీ, ఖాళీ అయితే ఇస్తామని ఇక్కడి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ సిబ్బంది పేర్కొన్నారు. ఆ మేరకు.. ఆస్పత్రి ఆవరణలో రెండు గంటలపాటు ఎదురుచూపులు చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆక్సిజన్‌ శాచురేషన్‌ లెవల్స్‌ పడిపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వృద్ధుడిని కాపాడాలంటూ ఆయన కుటుంబసభ్యులు వైద్య సిబ్బందికి విన్నవించారు. అయినా పట్టించుకోక పోవడంతో, అక్కడే ఉన్న అంబులెన్స్‌ నిర్వాహకుడు, సీపీఎం నేత గోపి స్పందించారు. దీంతో గంగరామయ్యకు తన అంబులెన్సులో ఉన్న ఆక్సిజన్‌ను అందజేసి మానవత్వం చాటుకున్నారు. 

Updated Date - 2021-05-19T05:29:11+05:30 IST