రాజనాల బండ పేరు చెప్పగానే చోరీకి గురైన రూ.11 లక్షల విలువైన నగలు ప్రత్యక్ష్యం

ABN , First Publish Date - 2021-12-26T04:49:55+05:30 IST

సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ పేరు చేప్పగానే చోరీకి గురైన నగలు ప్రత్యక్ష్యమైన సంఘటన శనివారం వె లుగు చూసింది.

రాజనాల బండ పేరు చెప్పగానే   చోరీకి గురైన రూ.11 లక్షల విలువైన నగలు ప్రత్యక్ష్యం
దేవుడి వద్ద నగలతో పూజలు చేస్తున్న రెహమాన్‌బాష

చౌడేపల్లె, డిసెంబరు 25: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ పేరు చేప్పగానే చోరీకి గురైన నగలు ప్రత్యక్ష్యమైన సంఘటన శనివారం వె లుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. బైరెడ్డిపల్లె పంచాయతీ ఎం కొత్తురుకు చెందిన రెహమాన్‌ బాష పండ్ల వ్యాపారి. తన ఇంటిలో బంగారు కమ్మలు, ఉంగరాలు, నక్లెస్‌, బంగారు గొలుసులు మొత్తం 250 గ్రాములను బీరువాలో ఉంచారు. గత నెల 13న ఆయన బీరువా తెరిచిచూడగా నగలు కనిపించలేదు. స్నేహితుల సలహా మేరకు రాజనాలబండలో సత్యప్రమాణానికి ఆలయ నిర్వాహకుల వద్ద అనుమతి తీసుకుని చుట్టు పక్క ఇళ్లవారిని సత్యప్రమాణానికి రావాలని కోరారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన ఇంటి ఆవరణలో చోరీకి గురైన నగలు మూటను గుర్తించారు. స్వామికృపతోనే తమ నగలు దక్కాయని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

Updated Date - 2021-12-26T04:49:55+05:30 IST