వైభవంగా గొబ్బి ఉత్సవం

ABN , First Publish Date - 2021-12-28T05:53:17+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం వైభవంగా గొబ్బి ఉత్సవం నిర్వహించారు.

వైభవంగా గొబ్బి ఉత్సవం
పురవీధుల్లో ఊరేగుతున్న గొబ్బి దేవత

శ్రీకాళహస్తి, డిసెంబరు 27: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం వైభవంగా గొబ్బి ఉత్సవం నిర్వహించారు. ధనుర్మాసం పురస్కరించుకుని ఏటా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయ అలంకార మండపంలో గొబ్బి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని చప్పరంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. తరలి వచ్చిన భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

Updated Date - 2021-12-28T05:53:17+05:30 IST