పులి దాడిలో నాలుగు మేకల మృతి

ABN , First Publish Date - 2021-12-28T06:02:27+05:30 IST

పులిదాడిలో నాలుగు మేకలు మృతిచెందిన సం ఘటన చౌడేపల్లె మండలంలో సోమవారం వెలుగు చూసింది.

పులి దాడిలో నాలుగు మేకల మృతి

చౌడేపల్లె, డిసెంబరు 27: పులిదాడిలో నాలుగు మేకలు మృతిచెందిన సం ఘటన చౌడేపల్లె మండలంలో సోమవారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. అమినిగుంట పంచాయతీలోని పులికోన వంకకు చెందిన గిరిజనుడు సుబ్రహ్మణ్యం మేకలు మేపుతూ జీవనం సాగించేవాడు. ఆదివారం మేకలను మేతకోసం మదురమలై కొండకు తోలుకెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. తన మేకల మందలో నాలుగు మేకలు కనిపించలేదు. ఉదయాన్నే అడవిలో గాలించగా చనిపోయిన మేకలను గుర్తించాడు. చనిపోయిన ఆనవాళ్ల ఆధారంగా పులి చంపేసిందని భావించాడు. సుమారు రూ.60వేలు వరకు నష్టపోయినట్లు వాపోయాడు. 

Updated Date - 2021-12-28T06:02:27+05:30 IST