ఈ నెల్లో రెండుసార్లు గరుడసేవ

ABN , First Publish Date - 2021-08-10T07:25:28+05:30 IST

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి తన ఇష్టవాహనమైన గరుడుడిపై ఈ నెల్లో రెండుసార్లు విహరించనున్నారు.

ఈ నెల్లో రెండుసార్లు గరుడసేవ

తిరుమల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి తన ఇష్టవాహనమైన గరుడుడిపై ఈ నెల్లో రెండుసార్లు విహరించనున్నారు. ఆగస్టు 13వ తేదీన గరుడ పంచమి పర్వదినం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మలయప్పస్వామి గరుడ వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఏటా తిరుమలలో గరుడపంచమిని ఘనంగా నిర్వహిస్తారు. తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండాలని నూతన దంపతులు.. తమకు పుట్టే సంతానం గరుడుడిలా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు స్త్రీలు ‘గరుడపంచమి’ పూజచేస్తారని పురాణోక్తి. ఇక, ప్రతినెలా తిరుమలలో పౌర్ణమి గరుడసేవ నిర్వహించడం సంప్రదాయం. అలా.. ఈనెల 22న శ్రావణ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడసేవరోజున వైభవంగా నిర్వహించనున్నారు. ఇలా.. రెండు పర్యాయాలు గరుడుడిపై మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో ఊరేగనున్నారు. 

Updated Date - 2021-08-10T07:25:28+05:30 IST