చెరువుల్లో గంబూసియా చేపలు
ABN , First Publish Date - 2021-06-08T05:23:33+05:30 IST
దోమల నివారణకు చెరువుల్లో గంబూసియా చేప పిల్లలు వదిలినట్లు డివిజన్ మలేరియా అధికారి గఫూర్ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, జూన్ 7: దోమల నివారణకు చెరువుల్లో గంబూసియా చేప పిల్లలు వదిలినట్లు డివిజన్ మలేరియా అధికారి గఫూర్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని కోమటివానిచెరువు, గజ్జెలగుంటలో, సీటీఎం చెరువుల్లో వైద్య సిబ్బంది గంబూషియా చేపపిల్లలను వదిలారు. హెల్త్ అసిస్టెంట్ మధు మాట్లాడుతూ... మురుగునీటిలో దోమల లార్వా పెరగకుండా గంబూ షియా చేపలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.