నేటినుంచి ఎస్వీయూలో పూర్తిస్థాయి పనివేళలు

ABN , First Publish Date - 2021-06-21T06:32:41+05:30 IST

రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలించిన నేపథ్యంలో ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కాననున్నారు.

నేటినుంచి ఎస్వీయూలో పూర్తిస్థాయి పనివేళలు

సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించనున్న ఉద్యోగులు


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్‌ 20: రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలించిన నేపథ్యంలో ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కాననున్నారు. గతంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు సేవలందించేవారు. మారిన కర్ఫ్యూ వేళలతో సోమవారం నుంచి ఉదయం 10.15 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విధులు ర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. 

Updated Date - 2021-06-21T06:32:41+05:30 IST